Motorola Edge 50: బీఐఎస్‌పై లిస్టైన మోటోరోలా ఎడ్జ్ 50

Highlights

  • త్వరలో Motorola Edge 50 లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ XT2407-3
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నుంచి ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Motorola Edge 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. అంతకు ముందు టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ, ఈఈసీ వంటి సర్టిఫికేషన్స్ పై కూడా Motorola Edge 50 కనిపించింది. ఇప్పుడు బీఐఎస్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 50 బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్‌పై XT-2407-3 అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ తప్పా, డివైజ్ యొక్క మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. అయితే త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.

Motorola Edge 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ మరియు ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై 6, జీపీఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఎఫ్‌సీసీ ద్వారా తెలిసాయి.

ప్రస్తుతం, Motorola Edge 50 కి సంబంధించి లభించిన సమాచారం ఇంతే. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.