HONOR 200 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • జులై 18న HONOR 200 5G సిరీస్ లాంచ్
  • అమెజాన్ ద్వారా టీజర్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న HONOR 200, 200 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HONOR నుంచి త్వరలో HONOR 200 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారైంది. హానర్ 200 5జీ సిరీస్ జులై 18వ తేదీన భారత్ లో విడుదలవుతోంది. ఈ లైనప్ లో HONOR 200 5G మరియు HONOR 200 Pro 5G డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోన్న ఈ సిరీస్ యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై కనిపిస్తోంది. సరే, ఓసారి హానర్ 200 5జీ సిరీస్ లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HONOR 200 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ పై విడుదలైన టీజర్ ప్రకారం, HONOR 200 5G సిరీస్ జులై 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. హానర్ 200, హానర్ 200 ప్రో డివైజెస్ ఈ లైనప్ లో లాంచ్ కానున్నాయి.

HONOR 200 5G సిరీస్ బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

మైక్రోసైట్ లో రివీలైన వివరాలను గమనిస్తే, 7.7 మి.మీ మందంతో HONOR 200 5G డివైజ్ వస్తున్నట్లు అర్థమవుతోంది.

Honor 200 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HONOR 200 లో 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.7-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. మరోవైపు HONOR 200 Pro లో 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ రెండు ఫోన్లలో 1.5కే ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HONOR 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. ఈ ఫోన్ లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఇచ్చారు. HONOR 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ అందించారు.

సాఫ్ట్‌వేర్: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

రియర్ కెమెరా: HONOR 200 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. HONOR 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర��, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. HONOR 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: HONOR 200, HONOR 200 Pro ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 కెమెరా ఉంది. దీని అపర్చర్ F/2.1. అయితే HONOR 200 Pro లో 3డీ డెప్త్ సెన్సర్ కూడా ఉంది. దీంతో ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉందని చెప్పవచ్చు.

బ్యాటరీ: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.